ఫిఫా వరల్డ్ కప్‌లో రాజకీయ ప్రకంపనలు.. ఇరాన్ స్థానంలో ఇటలీకి అవకాశం?
- ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ వైదొలగాలని నిర్ణయం
- ఇరాన్ స్థానంలో ఇటలీని ఆడించాలని అమెరికా ప్రతిపాదన
- పోప్‌పై ట్రంప్ వ్యాఖ్యలతో చెలరేగిన అంతర్జాతీయ వివాదం
- ఇటలీ ప్రధానితో సంబంధాలు చక్కదిద్దేందుకే ఈ ప్రయత్నం
- అర్హత కోల్పోయిన ఇటలీకి అనూహ్యంగా దక్కనున్న అవకాశం?
ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ అయిన ఫిఫా వరల్డ్ కప్‌కు రాజకీయ వివాదాల సెగ తగిలింది. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్లో అర్హత సాధించిన ఇరాన్ జట్టును తప్పించి, దాని స్థానంలో ఇటలీని చేర్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి ఒకరు ఫిఫాకు సూచించినట్లు సంచలన వార్తలు వెలువడుతున్నాయి. పోప్ లియో XIV పై ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన రాజకీయ వివాదాన్ని చల్లార్చేందుకే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
అమెరికా వలస విధానం, ఇరాన్‌తో యుద్ధం వంటి అంశాలపై పోప్ లియో XIV వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' మీడియా వేదికగా ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "పోప్ నేరాలను అరికట్టడంలో బలహీనంగా ఉన్నారు. విదేశాంగ విధానంలో ఘోరంగా విఫలమయ్యారు" అని ట్రంప్ చేసిన పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. ముఖ్యంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ వ్యాఖ్యలను "ఆమోదయోగ్యం కాదు" అని తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామంతో ట్రంప్, మెలోనీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ వరల్డ్ కప్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి పాలో జంపొల్లి మాట్లాడుతూ.. "వరల్డ్ కప్‌లో ఇరాన్ స్థానంలో ఇటలీని చేర్చాలని నేను ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినోలకు సూచించాను. నేను ఇటలీ సంతతికి చెందినవాడిని. అమెరికా ఆతిథ్యం ఇచ్చే టోర్నమెంట్లో అజూరీ (ఇటలీ జట్టు) ఆడటాన్ని చూడాలన్నది నా కల. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీకి ఆ అర్హత ఉంది" అని వివరించారు.
విచిత్రమేమిటంటే వరుసగా మూడుసార్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది. ప్లే-ఆఫ్‌లో బోస్నియా హెర్జెగోవినా చేతిలో ఓడిపోయి చరిత్రలో తొలిసారిగా ఇలాంటి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మరోవైపు ఇరాన్ వరుసగా నాలుగోసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో తమ గ్రూప్ మ్యాచ్‌లను అమెరికా నుంచి మెక్సికోకు మార్చాలని మొదట ఫిఫాను కోరింది. ఆ తర్వాత దేశంపై జరుగుతున్న వైమానిక దాడుల కారణంగా టోర్నమెంట్లో పాల్గొనలేమని ఇరాన్ క్రీడా మంత్రి అహ్మద్ దొన్యమాలి అధికారికంగా ప్రకటించారు.
దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. "ఇరాన్ జట్టుకు ప్రపంచకప్‌లోకి స్వాగతం. కానీ, వారి ప్రాణ భద్రత దృష్ట్యా వారు ఇక్కడ ఉండటం సబబు కాదని నేను భావిస్తున్నాను" అని 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఇరాన్ తన తొలి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో సోఫై స్టేడియంలో ఆడాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలతో అర్హత కోల్పోయిన ఇటలీకి అనూహ్యంగా తలుపులు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.